Take a fresh look at your lifestyle.

మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ చక్రవర్తి బొమ్మ శ్రీరామ్ నియామకం

 

ముద్ర, కరీంనగర్ :
రాష్ట్ర ప్రభుత్వం పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, వైస్ చైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించింది.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ శ్రేణులు, మున్నూరు కాపు సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. సామాజిక సేవలో ఉన్న శ్రీరామ్ చక్రవర్తి నియామకంతో బీసీ వర్గాల అభ్యున్నతికి మరింత ఊతం లభిస్తుందని అభిప్రాయపడ్డారు.

ఈ నియామకానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.