ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ఎం ఐ ఎం గెలిచిన ప్రతి చోటా గొడవలు, దాడులు సాధారణం అయ్యాయని, శాంతి భద్రతలు కావాలంటే బీజేపీ కి ఓటు వేయాలని మహారాష్ట్ర బీజేపీ మాజీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా అన్నారు. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారిని ఆమె ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం భైంసా లో ఎంఎల్ఏ రామారావు పటేల్ ఇంట్లో కార్యకర్తలతో మాట్లాడారు. భైంసా మున్సిపాలిటీ ఇప్పటివరకు ఎం ఐ ఎం చేతుల్లో ఉందని, ఈ సారి మాత్రం తిలకం ధరించే ప్రతి ఒక్కరు బీజేపీ కి ఓటు వేసి మున్సిపాలిటీ పై కాషాయం ఎగరవేసేలా చూడాలని కోరారు. దేశంలో ఎం ఐ ఎం గెలిచిన చోట్లు అశాంతి నిలయాలుగా మారాయని అన్నారు. ప్రతి హిందువు ఓటింగ్ పెంచి బీజేపీ కి ఓటు వేసి గెలిపించాలని కోరారు.