- టీజీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.
- అగ్రికల్చర్, ఫార్మాలో అబ్బాయిలదే హవా.
- ఇంజినీరింగ్‌లో ఏపీ విద్యార్థికి టాప్ ర్యాంక్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీఈఏపీసెట్) ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం హైదరాబాద్‌లోని తన నివాసంలో అధికారులతో కలిసి ఈ ఫలితాలు విడుదల చేశారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో అబ్బాయిలు పైచేయి సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థికి మొదటి ర్యాంక్ వచ్చింది. అగ్రి, ఫార్మా విభాగంలో మొదటి పది ర్యాంకుల్లో ఒకే ఒక్క అమ్మాయి ఉంది. మేడ్చల్ జిల్లాకు చెందిన సాకేత్ రెడ్డికి టాప్ ర్యాంక్ వచ్చింది.ఈ ఎంట్రెన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ విభాగంలో 2,07,190 విద్యార్థులు హాజరు కాగా, 1,51,779 మంది (73.26శాతం) ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగంలో 81,198 విద్యార్థులు హాజరు కాగా, 71,309 (87.82శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఎంట్రెన్స్ లో ఉత్తీర్ణులైన విద్యార్థినీ విద్యార్థులకు, నిర్వాహకులను సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ. వి బాలకిష్టా రెడ్డి, ఎప్‌సెట్ 2025 చైర్మన్ ప్రొ. టి. కిషన్ కుమార్ రెడ్డి, కన్వీనర్ డా. బి. డీన్ కుమార్ తో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
- ఇంజినీరింగ్ విభాగంలో టాప్-10 ర్యాంకులు.
1. పల్లా భరత్ చంద్ర- మన్యం జిల్లా కొమరాడ (ఏపీ)
2. ఉదగండ్ల రామచరణ్ రెడ్డి- రంగారెడ్డి జిల్లా మాదాపూర్
3. పమ్మిన హేమసాయి సూర్యకార్తీక్- విజయనగరం జిల్లా
4. మెండె లక్ష్మీభార్గవ్- నాచారం
5. వెంకట గణేశ్ రాయల్- మాదాపూర్
6. సుంకర సాయి రిశాంత్‌రెడ్డి- మాదాపూర్
7. రష్మిత్ బండారి- మాదాపూర్
8. బనిబ్రత మాజీ- బండగ్‌పేట
9. కొత్త ధనుష్ రెడ్డి- నార్సింగి, రంగారెడ్డి
10. కొమ్మ శ్రీకార్తీక్- మేడ్చల్
- అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో.
1. పెద్దక్కగారి సాకేత్‌రెడ్డి- నిజాంపేట, మేడ్చల్
2. సబ్బాని లలిత్ వరేణ్య- కరీంనగర్
3. చాడా అక్షిత్- వరంగల్
4. పెద్దింటి రాచర్ల సాయినాథ్- కొత్తకొట
5. బ్రాహ్మణి- మాదాపూర్
6. గుమ్మడిదల తేజస్- కూకట్‌పల్లి
7. అఖిరానంద్‌రెడ్డి- నిజాంపేట
8. భానుప్రకాశ్‌రెడ్డి- సరూర్‌నగర్
9. శామ్యూల్ సాత్విక్- హైదర్‌గూడ
10. అద్దుల శశికిరణ్‌రెడ్డి- బాలాపూర్.