ముద్ర, వనపర్తి : వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలో పరిధిలో మొత్తం 80 వార్డులు ఉండగా నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ తర్వాత 341 మంది బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. జిల్లాలోని వనపర్తి మున్సిపాలిటీలో 33 వార్డులకు గాను 150 మంది, పెబ్బేరు మున్సిపాలిటీలో 12 వార్డులకు గాను 501 మంది, కొత్తకోట మున్సిపాలిటీలో 15 వార్డులకు గాను 56 మంది, ఆత్మకూరు మున్సిపాలిటీలో 10 వార్డులగాను 41 మంది, అమరచింత మున్సిపాలిటీలో 10 వార్డులకు గాను 43 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్లు ఆయా ఎన్నికల అధికారులు ప్రకటించారు.