నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి:
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫర్ ఆర్ట్స్ & కామర్స్ మరియు తెలంగాణ హరిటేజ్ శాఖ మధ్య వారసత్వ పరిరక్షణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని పురాతత్వ, సాంస్కృతిక వారసత్వ స్థలాల పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. కళాశాల చరిత్ర విభాగాధిపతి డా. పి. ధర్మ ఆధ్వర్యంలో అధ్యాపకులు డా. హాజీరా పర్వీనా, డా. ఎం. రవీందర్ సహకారంతో కళలు, పురావస్తు శాస్త్రం, నిర్మాణ శైలి, వాణిజ్య విధానాలపై స్వల్పకాలిక పరిశోధన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
విద్యార్థులను తవ్వకాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, డాక్యుమెంటేషన్ వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా వారికి ప్రాయోగిక జ్ఞానం అందించనున్నారు. తెలంగాణ హరిటేజ్ శాఖ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించడంతో పాటు నిపుణుల ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనుంది. అదనంగా ప్రతి సెమిస్టర్‌కు ఒకసారి మ్యూజియంల సందర్శనకు అవకాశం కల్పించనున్నారు.
ఈ ఒప్పందం ఐదు సంవత్సరాలపాటు అమల్లో ఉండనుంది. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి మరియు హరిటేజ్ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో వారసత్వ పరిరక్షణపై చైతన్యం పెంపొందడంతో పాటు పరిశోధన, శిక్షణా అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.నాగర్‌కర్నూల్, ముద్ర ప్రతినిధి:
నాగర్‌కర్నూల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఫర్ ఆర్ట్స్ & కామర్స్ మరియు తెలంగాణ హరిటేజ్ శాఖ మధ్య వారసత్వ పరిరక్షణకు సంబంధించిన అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.
ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ రాష్ట్రంలోని పురాతత్వ, సాంస్కృతిక వారసత్వ స్థలాల పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా నిర్ణయించారు. కళాశాల చరిత్ర విభాగాధిపతి డా. పి. ధర్మ ఆధ్వర్యంలో అధ్యాపకులు డా. హాజీరా పర్వీనా, డా. ఎం. రవీందర్ సహకారంతో కళలు, పురావస్తు శాస్త్రం, నిర్మాణ శైలి, వాణిజ్య విధానాలపై స్వల్పకాలిక పరిశోధన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
విద్యార్థులను తవ్వకాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, డాక్యుమెంటేషన్ వంటి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం ద్వారా వారికి ప్రాయోగిక జ్ఞానం అందించనున్నారు. తెలంగాణ హరిటేజ్ శాఖ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించడంతో పాటు నిపుణుల ద్వారా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనుంది. అదనంగా ప్రతి సెమిస్టర్‌కు ఒకసారి మ్యూజియంల సందర్శనకు అవకాశం కల్పించనున్నారు.
ఈ ఒప్పందం ఐదు సంవత్సరాలపాటు అమల్లో ఉండనుంది. కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. గీతాంజలి మరియు హరిటేజ్ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో వారసత్వ పరిరక్షణపై చైతన్యం పెంపొందడంతో పాటు పరిశోధన, శిక్షణా అవకాశాలు మరింత విస్తరించనున్నాయి.