ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
……………………………………….
మహబూబ్‌నగర్‌లో 16 మంది దివ్యాంగులకు శుక్రవారం ఎలక్ట్రిక్ స్కూటీల పంపిణీ చేశారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.

దివ్యాంగుల జీవన ప్రమాణాల మెరుగుదల లక్ష్యంగా సంక్షేమ పథకాల ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.విద్య, ఉపాధి, ఆరోగ్య రంగాల్లో మరిన్ని అవకాశాలు కల్పించనున్నట్లు,
భవిష్యత్తులో మరింత మందికి సాయం విస్తరణకు హామీ ఇచ్చారు.దివ్యంగుల అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్ మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నదని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమం లో మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహా రెడ్డి, కార్పొరేటర్లు,కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
…………………………………..
పయనీర్ కేంద్రం సందర్శన
…………………………………..
మహబూబ్‌నగర్ లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మహబూబ్‌నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన పయనీర్ సెంటర్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు. నీట్, ఎప్సెట్ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు తన సొంత నిధులతో ఉచితంగా అందిస్తున్న ఈ సెంటర్ సేవలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది 116 మంది విద్యార్థులు పలు కోర్సు ల్లో ఉత్తమ ర్యాంకులు సాధించడం గర్వకారణమని తెలిపారు. ఈ సంవత్సరం అంతకుమించి ర్యాంకులు సాధించాలని విద్యార్థులకు సూచించారు. చదువు ఒక్కటే మనకు శక్తివంతమైన ఆయుధమని ఎమ్మెల్యే అన్నారు.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ భగవంతచారీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, కార్పొరేటర్లు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.