గడువులోపు పనులు పూర్తి చేయాలి.. సామాన్యులకు సైతం అందుబాటులోకి ఉన్నత విద్యా.. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
పెగడపల్లి:
ఉపాధి హామీ పథకంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పెగడపల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
పెగడపల్లి మండల కేంద్రంలో రూ. 30 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి ఆదివారం శంకుస్థాపన చేశారు. పెగడపల్లి మోడల్ స్కూల్ లో రూ. 10 లక్షలతో నూతనంగా నిర్మించిన వంటశాలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ 2026 – 27 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక కిచెన్ షెడ్ ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి తెలిపారు. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో మరిన్ని మార్పులు తీసుకువచ్చి సామాన్యులకు ఉన్నత విద్యాను అందించాడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు.