ముద్ర ప్రతినిధి, నిర్మల్:
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ లా ఉందని, ఇందులో సామాజిక న్యాయం లోపించిందని బి ఎస్పీ జిల్లా అధ్యక్షులు, న్యాయవాది జగన్మోహన్ విమర్శించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ కేటాయించిన నిధులను చూస్తుంటే అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. బడ్జెట్ విద్యా, వైద్య రంగాలకుక తక్కువ మొత్తం కేటాయించడం సరికాదన్నారు. వాటాల వారీగా చూస్తే వ్యవసాయ రంగానికి రూ.23,179 కోట్లు కేటాయించి రైతులను నమ్మించి నట్టేట ముంచేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. విద్యారంగానికి అరకొర నిధులు కేటాయించిన ఫలితంగా పేదలకు ప్రభుత్వ విద్య అందని ద్రాక్షలా మారనుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అనుకూలంగా కేటాయింపులు లేవన్నారు, ప్రధానంగా బీసీలు 56% ఉంటే మూడు శాతం మాత్రమే కేటాయించారన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై కూడా ప్రస్తావించలేదన్నారు.