Take a fresh look at your lifestyle.

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సిపిఐ కృషి – ఇంటింటికి ప్రచార కార్యక్రమం ప్రారంభం

-ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తున్న సిపిఐ పార్టీకి విరివిగా విరాళాలు ఇవ్వండి.
-సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి.
ముద్ర, మోత్కూరు:
సిపిఐ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం మోత్కూరు పట్టణ కేంద్రంలో ఇంటింటికి సిపిఐ ప్రచార కార్యక్రమాన్ని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నది అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి ఇంటింటికి సిపిఐ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అయన అన్నారు.ఇట్టి ప్రచార కార్యక్రమంలో అనేకమంది ప్రజలు ఎక్కువ శాతం ఇందిరమ్మ ఇల్లు కావాలని పెన్షన్స్ కావాలని తమ దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి అనేపు వెంకట్ ఏఐటీయూసీ మండల కార్యదర్శి జంగ నర్సయ్య, సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి గొలుసుల యాదగిరి,బీసీ హక్కుల సాధన సమితి మండల అధ్యక్షులు పెండెం వెంకటేశ్వర్లు , నిలిగొండ అశోక్, మానుపాటి సాయిలు, పంగ యాదగిరి, గంగాదేవి చంద్రయ్య, నిలిగొండ రాములు, మహిళా సంఘం పట్టణ అధ్యక్షులు నల్ల పుష్పమ్మ, జంగ జాంగిర్, గొలుసుల పిచ్చమ్మ, నిలిగొండ అండాలు, జంగ సైదమ్మ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.