ముద్ర, మోత్కూర్:
మోత్కూరు మండలం దత్తప్ప గూడెం గ్రామానికి చెందిన ఏనుగుల మత్స్యగిరి తల్లి పద్మ కి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన 43,000 వేల రూపాయల చెక్కు ను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,మాజీ ఎంపీటీసీ ఎలుగు పార్వతమ్మ యాదయ్య ల సహాయంతో మంజూరి అయిన చెక్కును 5 వ వార్డు సభ్యులు వంగూరి శ్రీకాంత్ బుధవారం లబ్దిదారుల కి స్వయంగా అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ మెంబర్ ఎస్ కె సాజిద్ పాషా,ఎలుగు కోటి లింగం, దేవసరి రాములు, వలపు యాదయ్య, కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.