Take a fresh look at your lifestyle.

అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన పీయేసీ ఛైర్మన్ అరెకపూడి

ముద్ర, శేరిలింగంపల్లి:
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు కాలనీల్లో రూ.1 కోటి 24 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపనలు చేశారు. శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ, స్ప్రింగ్ వ్యాలీ కాలనీలలో రూ. 1 కోటి 24 లక్షల రూపాయలతో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు మరియు వరద నీటి కాల్వ నిర్మాణము పనులకు సీనియర్ నాయకులు మారబోయిన రాజు యాదవ్ తో కలిసి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గం మరియు కాలనీల అభివృద్దే ధ్యేయంగా ప్రజల సౌకర్యార్థం వెంకటేశ్వర కాలనీ, స్ప్రింగ్
ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి మార్గదర్శకంలో గౌరవ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారి సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామన్నారు. హఫీజ్పెట్ మంజీర రోడ్డు నుండి మసీదు బండ కు వెళ్లే లింక్ రోడ్డు లో గల రైల్వే అండర్ పాస్ వద్ద ఉదయం, సాయంత్రం తీవ్ర ట్రాఫిక్ ఇక్కట్లను తీర్చాలనే ఉద్దేశ్యంతో తీసుకోవాల్సిన చర్యలలో భాగంగా వరద నీటి కాల్వ నిర్మాణం పనులు చేపడుతున్నామని, ప్రజలకు సుఖవంతమైన ప్రయాణానికి బాటలు వేస్తామని గాంధీ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు, కాలనీల అసోసియేషన్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.