Take a fresh look at your lifestyle.

క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఘనంగా నిర్వహణ

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్

“365 రోజులు – 365 కార్యక్రమాలు”లో భాగంగా క్లాస్మేట్ క్లబ్ ఆధ్వర్యంలో 132వ రోజు సందర్భంగా నాగర్ కర్నూల్ జనరల్ హాస్పిటల్‌లో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 60 మంది నర్సులను సన్మానించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రవిశంకర్ మాట్లాడుతూ, రోగుల సేవలో నర్సులు అందిస్తున్న సేవలు అమూల్యమని అన్నారు. నర్సుల సేవలను గుర్తించి వారిని సన్మానించడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే నర్సింగ్ కోర్సులు పూర్తి చేసుకునేందుకు కొందరు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించిన క్లాస్మేట్ క్లబ్ ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి నెలా ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తున్న క్లబ్ వ్యవస్థాపకులు వాస రాఘవేందర్ మరియు సభ్యుల సేవలను కొనియాడారు.
క్లాస్మేట్ క్లబ్ వ్యవస్థాపకులు వాస రాఘవేందర్ మాట్లాడుతూ, సమాజంలో అన్ని వృత్తులు గౌరవప్రదమైనవేనని, నర్సులు రోగులకు అంకితభావంతో సేవలందిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ నర్సింగ్ వృత్తిని గౌరవించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, రాష్ట్ర ప్రతినిధులు పోల శ్రీనివాస్, కేపీ ప్రసాద్, డాక్టర్ అజీమ్, గిరి జగన్మోహన్ రెడ్డి, జ్ఞానేశ్వరి, నిర్మల, రామ్ చందర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమానికి సహకరించిన దాతలు
క్లాస్మేట్ క్లబ్ వ్యవస్థాపకులు వాస రాఘవేందర్
రిటైర్డ్ టీచర్ సత్యనారాయణ
కల్వకుర్తి ఎలక్ట్రికల్ గుండ్ల రేవంత్

Leave A Reply

Your email address will not be published.