Take a fresh look at your lifestyle.

కెసిఆర్ బయటకు వస్తాడనే రైతు బంధు వేశారు…

 

– సిద్దిపేట రూరల్ మండలం బుస్సా పూర్ గ్రామం లో బీరప్ప ఉత్సవాల్లో పాల్గొన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

సిద్దిపేట రూరల్ మండలం బుస్సా పూర్ గ్రామం లో జరుగుతున్న బీరప్ప ఉత్సవాల్లో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతు బీరప్ప దేవాలయం ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగిందన్నారు..10 రోజుల పాటు బీరప్ప ఉత్సవాలు కుటుంబ సమేతంగా ఘనంగా జరుపుకుంటారు. గొర్రెలకు డీడీలు కట్టిన ప్రతి ఒక్కరికి 100% గొర్రెల పంపిణి చేసిన ఘనత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ది అన్నారు. యూనిట్ ఇప్పించిన కురుమ సంఘానికి నిర్మాణానికి సహకరించడం జరిగిందన్నారు.
కురుమ సంఘం భవనం కట్టుకున్నాం చుట్టూ సిసి పొయించిన. గుడికి స్పెషల్ డెవలప్మెంట్ నిధులతో 5 లక్షలు ఇచ్చాను.గొర్రెల షెడ్లు నిర్మించాము.- బీరప్ప గుడి కి మా నాన్న పేరు మీద లక్ష రూపాయల తో రీలింగ్ వేయడం జరిగింది. మినీ ట్యాంక్ కూడా ఏర్పాటు చేసాం. పదేళ్ల లో గ్రామం అభివృద్ధి ఆదర్శం గా నిలుపుకున్నాము. బుస్సా పూర్ మీదుగా రింగ్ రోడ్డు వేసుకున్నాం. గ్రామం లో అన్నీ కుల సంఘాలకు భవనాలు నిర్మించాము. ఎల్లమ్మ గుడి వద్ద ఊరు అందరి కోసం ఫంక్షన్ హల్ 30లక్షల తో నిర్మించాం. మీరు అడిగిన ప్రతి రోడ్డు ఇచ్చిన తొర్నాల నుండి బుస్సా పూర్ కి రోడ్డు.బుస్సా పూర్ నుండి ఘనపూర్ కు డబుల్ రోడ్డు. బుస్సా పూర్ నుండి గుడి కందుల, వరద రాజు పల్లి కి రోడ్డు గల్లీ గల్లీ లో సిసి రోడ్లు నిర్మించుకున్నాం. బడిని మంచి గా చేసుకున్నాం. ఇలా అన్నీ రకాలుగా అభివృద్ధి చేసుకున్నాం. ఈ ప్రభుత్వం వచ్చాక రైతు లను తిప్పలు పెడుతున్నారు. కెసిఆర్ బయటకు వస్తే రైతు బందు వేస్తున్నాడు. వడ్లు. మక్కలు 22 రోజుల నుండి కొనక కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారని చెప్పారు. కెసిఆర్ బయకొస్తే భయపడి ఎకరానికి రైతు బందు వేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 22 రోజుల నుండి వడ్లు, మక్కలు కొనక రైతులను తిప్పలు పెడుతున్నారు.కెసిఆర్ ఉన్నపుడు లేని తిప్పలు ఇప్పుడు ఎందుకు వచ్చింది..రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని మండి పడ్డారు బుస్సా పూర్ కు లిఫ్ట్ మంజూరు చేసాం 90%పనులు నేను నీళ్ల మంత్రి గా ఉన్న సమయం లోనే పూర్తి చేసుకున్నా మన్నారు ఈ ప్రభుత్వం వచ్చాక తట్టేడు మట్టి ఎత్తలేదని చెప్పారు త్వరలోనే పనులు పూర్తి చేసుకొని లిఫ్ట్ తో పంట పొలాల వాకిట్లో కి నీళ్లు వచ్చేలా కృషి చేస్తానాన్నరు. ఈ సందర్బంగా బీరప్ప మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు..

Leave A Reply

Your email address will not be published.