ముద్ర, శేరిలింగంపల్లి:
క్రీడా ప్రాంగణాల కోసం తమ తమ పరిధిలో ఉన్న ఖాలీ స్థలాల వివరాలు మూడు రోజుల్లో అందించాలని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే అధికారులను ఆదేశించారు. శుక్రవారం జోన్ పరిధిలోని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో హేమంత్ మాట్లాడుతూ తమ పరిధిలిలో ఉన్న ప్రాంతాల్లో కొత్త స్టేడియాల ఏర్పాటు కోసం ఖాళీ స్థలాలను గుర్తించి సోమవారంలోగా సంబంధిత స్థలాల వివరాలు ఇవ్వాలన్నారు. జోన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులు, 99 రోజుల ప్రణాళిక లక్ష్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 50 శాతానికి పైగా పూర్తయిన పనులను 99 రోజుల ప్రణాళికలోగా పూర్తి చేయాలని, రోడ్లపై గుంతలను గుర్తించి ప్రతి 15 రోజులకోసారి నివేదిక ఇవ్వాన్నారు. ఏప్రిల్ 15 లోగా నాలల్లో పూడికతీత పనులు పూర్తి కావాలని, ఈ సందర్భంగా అమీన్‌పూర్ పార్కు పనుల ఆవశ్యకతను గుర్తుచేశారు. ఖాజాగూడలోని ఎంజెఆర్ బిల్డింగ్ సెల్లార్ స్ట్రక్చరల్ అనాలిసిస్ కోసం ఉన్నతాధికారులకు లేఖ రాయాలని సూచించారు. జంక్షన్లలో ఫుట్‌పాత్‌లు, మీడియన్ పెయింటింగ్ పనులకు సంబంధించి సర్కిల్ వారీగా ప్రతిపాదనలను సోమవారంలోగా సిద్ధం చేయాలని,
ట్రాఫిక్ పోలీసులు గుర్తించిన 18 నీటి నిల్వ పాయింట్ల వద్ద శాశ్వత పరిష్కారాలు చూపాలన్నారు. సాధ్యం కాని చోట తాత్కాలిక చర్యలు చేపట్టి, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని, ముఖ్యంగా టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించి వారానికోసారి సమీక్షించి పురోగతి తెలుసుకుంటానన్నారు. వేసవి సమీపించిన సందర్భంగా త్రాగు నీటి విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలి, లీకేజీలలను తక్షణమే అరికట్టాలి, పారిశుద్ద్యం విషయంలోనూ సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటానన్నారు.