ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల హామీలను వంద శాతం అమలు చేసి తీరుతాం
-మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ముద్ర న్యూస్, కోరుట్ల/ మెట్ పల్లి:
మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారడం ఆయన వ్యక్తిగత విషయమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ లలో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి అడ్లూరి మాట్లాడుతూ ‘అనేక సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం నేపథ్యంలో పార్టీ మారవద్దని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీధర్ బాబు తో పాటు తో పాటు పలువురు ఎమ్మెల్యేలు స్వయంగా కలిసి పార్టీ మారవద్దని కోరినట్లు మంత్రి అడ్లూరి తెలిపారు.
వందేళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలంలోనే శ్రీశైలం, నాగార్జునసాగర్, శ్రీ రామ్ సాగర్ వంటి అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించమని మంత్రి గుర్తు చేశారు.
2014 ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి మర్చిపోయారని మంత్రి అన్నారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ఒక్క హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేదని మంత్రి ఆరోపించారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తామన్నారని కానీ ఏనాడు దళితులను కేసీఆర్ పట్టించుకోలేదని మంత్రి అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వంద శాతం అమలు చేసి తీరుతామని తీరుతామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అండతో 2029లో సైతం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారని మంత్రి అడ్లూరి తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న ఇద్దరు కేంద్ర మంత్రులతో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రాష్ట్రంలో గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులు కేంద్ర ప్రభుత్వంతో చేయించాల్సిన పనులను పక్కనపెట్టి రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.