ముద్ర ప్రతినిధి, నిర్మల్:
సమాజంలో ఆడపిల్లల పట్ల వివక్ష పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో ఆడపిల్లల తల్లిదండ్రులకు భరోసా కల్పించే వినూత్న పథకాన్ని అంబేద్కర్ జయంతి సందర్భంగా అమలు చేస్తున్నారు నిర్మల్ రూరల్ అనంతపేట్ సర్పంచ్ సునీత. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆమె మంగళవారం ” మా ఊరి బంగారు తల్లి” అనే కొత్త పథకాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా ఊళ్ళో ఆడపిల్ల పుట్టగానే పాప పేరిట బ్యాంకు ఖాతాలో ఐదు వేలు జమ చేయడంతో పాటు రెండు శ్రీ గంధం మొక్కలు బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఆడపిల్లల పట్ల సమాజంలో గౌరవం పెంచేందుకే తాను ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.