Take a fresh look at your lifestyle.

వడ దెబ్బకు జాగ్రత్తలు ముఖ్యం కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచనలు

ముద్ర ప్రతినిధి మెదక్:
వేసవిలో ఎండ తీవ్రత దృష్ట్యా వడ దెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీయనుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు.
తీవ్ర వడగాలులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
వడదెబ్బ కారణంగా ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలు పడకుండా ఉండేందుకు జిల్లా పరిపాలన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో తాగునీటి సరఫరా, చలివేంద్రాల ఏర్పాటు, ఆరోగ్య కేంద్రాలలో అవసరమైన మందులు ఓఆర్ఎస్ నిల్వలు, బహిరంగ ప్రదేశాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టినట్లు వివరించారు. ముఖ్యంగా కార్మికులు, వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు వంటి సున్నిత వర్గాల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రజలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దని సూచించారు. పుష్కలంగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలని, తేలికపాటి దుస్తులు ధరించాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.
అలాగే, జిల్లా వ్యాప్తంగా బస్ స్టాండ్లు, మార్కెట్లు, పనిస్థలాల్లో తాగునీరు, నీడ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
వడగాలుల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి సహకరించాలని కోరారు

Leave A Reply

Your email address will not be published.