Take a fresh look at your lifestyle.

గనిపై కార్మిక నాయకుని జన్మదిన వేడుకలు

యైటింక్లయిన్ కాలనీ. ముద్ర: సింగరేణి రామగుండం రీజియన్ అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్ట్ లో శనివారం హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, (జెబిసిసిఐ) సభ్యులు ఎండి.రియాజ్ అహ్మద్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఉదయం ప్రాజెక్ట్ ఆవరణలో స్తానిక నాయకులు ఏర్పాటు చేసిన వేడుకల్లో పాల్గొన్న స్తానిక, ఏరియా నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి, రియాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ జన్మదిన వేడుకల్లో యూనియన్ నాయకులు గోశిక అశోక్, మహేష్, రేవెల్లి రాజశేఖర్, రంగు అంజి, నవీన్, హుస్సేన్, శ్రీకాంత్, రవికుమార్, రాణా చరణ్, దస్తగిరి, కిరణ్, ఉప్పు రమేష్, బీరయ్య, శంకర్, రవి, సాయి, దీపక్, శీను, సురేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.