Take a fresh look at your lifestyle.

అతివేగం, నిర్లక్ష్యంతోనే రోడ్డు ప్రమాదాలు ప్రమాదాల నివారణపై ప్రతిజ్ఞ, సెల్ఫీ పాయింట్ కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రస్తుత సమాజంలో అతివేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి ఎందరో విలువైన తమ ప్రాణాలను కోల్పోతున్నారు, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు నివారించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించే ఉద్దేశంతో అరైవ్ – అలైవ్ కార్యక్రమంలో భాగంగా మెదక్
రాందాస్ చౌరస్తాలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా అధికారులు, ఆటో డ్రైవర్స్, విద్యార్థుల సమక్షంలో ప్రతిజ్ఞ నిర్వహించిన అనంతరం సెల్ఫీ పాయింట్ ప్రారంభించారు.
మాట్లాడుతూ..ప్రజల్లో చైతన్యం పెంచి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలన్నారు. ఎస్పీ డీ.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ…
మనం తీసుకునే జాగ్రత్తలతోనే రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఉంటామన్నారు. పంచాయతీరాజ్, ఆర్అండ్ బీ, రవాణా శాఖ అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు చేయాలన్నారు.
ప్రాణాల కంటే ఏది విలువైంది కాదు, చిన్న చిన్న జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు.
గ్రామాల్లో అత్యవసర వేళ సంప్రదించాల్సిన అంబులెన్స్, పోలీసుల నెంబర్ పై అవగాహన కల్పించాలని సూచించారు.
అందరి భాగస్వామ్యంతోనే రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి, ప్రతి ఒక్కరూ రోడ్డుపైకి వచ్చినప్పుడు బాధ్యతతో మెలగాలని సూచించారు. అనంతరం ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్డీఓ రమాదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ డీఎస్పీ ప్రసన్నకుమార్, జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటస్వామి, అధికారి డిఆర్డిఓ శ్రీనివాసరావు, నేషనల్ హైవే ఈ.ఈ కరుణ, డి.ఈ ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ కార్యాలయం ముందు నేషనల్ హైవే 765-డిజి రోడ్డు మరమ్మత్తులు జరుగుతున్న ప్రాంతాన్ని కలెక్టర్, ఎస్పీ, నేషనల్ హైవే అధికారులు, పోలీస్ యంత్రాంగంతో కలిసి పరిశీలించారు. నేషనల్ హైవే అధికారులకు పలు సూచనలు చేస్తూ త్వరితగతిన మరమత్తులు పూర్తి చేసి పునరుద్ధరించాలన్నారు. వాహన చోదకులకు, సురక్షిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. వేగాన్ని నియంత్రించే రక్షణ చర్యలు చేపట్టి ప్రమాదాల నివారణ లక్ష్యంగా పనిచేయాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.