Take a fresh look at your lifestyle.

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కంట్రోల్ రూం 9553866388 ఏర్పాటు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి మెదక్:
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం నిర్వహణలో భాగంగా ప్రజల సౌకర్యార్థం మెదక్ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ 9553866388 ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా జూన్ 15 నుండి 24 వరకు సన్నాహక, శిక్షణ, ముద్రణ, జూన్ 25 నుండి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారుల ఇంటింటి సందర్శన, జూలై 24న పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ, 31న ముసాయిదా జాబితా ప్రచురణ చేయడం జరుగుతుందని వివరించారు. జూలై 31నుండి ఆగస్టు 30 వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుందని, సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఫిర్యాదులు, అభ్యంతరాల పరిష్కారం ప్రక్రియ తరువాత అక్టోబర్ 1న తుది జాబితా ప్రచురించడం జరుగుతుందని తెలిపారు.
ఈ క్రమంలో ప్రజల సౌకర్యం కంట్రోల్ రూమ్
ఏర్పాటు చేయడం జరిగిందని, పని దినాలలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని,  సందేహాలు, సమాచారం కొరకు కంట్రోల్ రూమ్ నంబర్లో సంప్రదించవచ్చని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.