Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ వైద్య కళాశాల స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

ముద్ర, ప్రతినిధి భువనగిరి :
యాదగిరిగుట్టలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ వైద్య కళాశాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని సందర్శించి, అక్కడ చేపట్టాల్సిన పనుల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. వైద్య కళాశాల నిర్మాణ పనులు ఎప్పటి నుండి ప్రారంభించారని , ప్రస్తుతం చేపడుతున్న ఏర్పాట్ల పనులను అధికారులు కలెక్టర్‌కు వివరించారు.
అనంతరం వైద్య కళాశాల భవనానికి సంబంధించిన నమూనా మ్యాప్‌ను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థులకు, వైద్య సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు.
వైద్య కళాశాల నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ అధికారులు, ఇంజినీరింగ్ విబాగం డి. ఈ., తహశీల్దార్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.