Take a fresh look at your lifestyle.

కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కార్యక్రమం

 

ముద్ర, తాండూర్:

వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని సాయిపూర్ లో బిజెపి సీనియర్ నాయకులు ఇందు రాములు గారి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం వారితో కలిసి కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందూర్ రాములు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని బీద ప్రజల అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసంకేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని వీటి పట్ల చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఈ పథకానికి వార్షిక ప్రీమియం కేవలం 20 రూపాయలు చెల్లిస్తే ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే 2 లక్షల ప్రమాద బీమా లభిస్తుందని, ప్రధానమంత్రి జీవనజ్యోతి భీమ యోజన ఈ పథకానికి వార్షిక ప్రీమియం 436 చెల్లిస్తే రెండు లక్షల జీవిత బీమా లభిస్తుందని, అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన అతి తక్కువ పెట్టుబడిదో వృద్యాపంలో పెన్షన్ రూపంలో అధిక ప్రయోజనం కలుగుతుందని, కావున పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎన్నో సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు తాండ్ర నరేష్ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.