దళితుల పక్షపాతి కాంగ్రెస్ పార్టీ.. – ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలి – ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్
సిద్దిపేట, ముద్ర ప్రతినిధి :
కాంగ్రెస్ పార్టీ దళితులకు పెద్దపీట వేసి వారి అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తుందని సిద్దిపేట కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. ఈనెల 12 గురువారం రోజున కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ గా ఖమ్మంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ లోని గాంధీభవన్లో జరుగుతుందని..ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా నుండి అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుట్ల యేసు ,కొత్తూరి నరహరి, ముత్యాల యాదగిరి, బొడ్డు బాలరాజు, పుట్ల ప్రసాద్,మందాల దాసు,బూరుగుపల్లి సర్పంచ్ బాలయ్య, బయ్యారం యాదగిరి,కృష్ణ,యాదగిరి, కృష్ణ, శ్రీను, తిరుపతి,మల్లయ్య శ్రీను బాబు తదితరులు పాల్గొన్నారు..