Take a fresh look at your lifestyle.

తెలంగాణ పోలీసులకు విశిష్ట సేవా పతకాలు

ముద్ర, తెలంగాణ బ్యూరో : 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సేవలందించి పోలీస్ అధికారులకు కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు, పౌర రక్షణ సేవలకు సంబంధించిన మొత్తం 942 మంది సిబ్బందిని గ్యాలంట్రీ అవార్డులతో గౌరవించింది. వీరిలో 746 మందికి పోలీస్‌ విశిష్ట సేవా పతకాలు (మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్), 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 95 మందికి గ్యాలంట్రీ పతకాలు, ఇద్దరి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంట్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు.

ఉత్తమ సేవలు అందించిన వారిలో తెలంగాణకు చెందిన హైదరాబాద్ లాండ్ అండ్ ఆర్డర్ అదనపు సీపీ విక్రమ్ సింగ్, ఎస్పీ మాణిక్యరాజ్ కు ప్రెసిడెంట్ మెడల్స్ , మరో 12 మంది పోలీస్ అధికారులకు విశిష్ట సేవా పతకాలు వరించాయి. వారిలో ఐజీ కార్తికేయ, ఎస్పీ లు ముత్యం రెడ్డి, కె, రామ్ కుమార్, ఫజ్లుర్ రెహమాన్ స డీఎస్పీలు కొటపాటి వెంకట రమణ, అన్ను వేణుగోపాల్, ఇన్ స్పెక్టర్ నిరంజన్ రెడ్డి, ఏఎస్సై లు రన్‌వీర్ సింగ్, ఠాకూర్, జోసెఫ్‌ బహదూర్, మోయినుల్లాఖాన్ , హెడ్ కానిస్టేబుళ్లు పాత్య నాయక్, అయూబ్ ఖాన్‌ లకు విశిష్ట సేవా పతకాలు, మరో ముగ్గురు ఫైర్ అధికారులకు, నలుగురు హోం గార్డులకు విశిష్ట సేవా పతకాలు అందుకోనున్నారు.

Leave A Reply

Your email address will not be published.