Take a fresh look at your lifestyle.

హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలం మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

 

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలు,ముఖ్యంగా 6 గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మండిపడ్డారు.
హామీలు అమలు చేయాలని కోరుతూ శుక్రవారం బిజెపి జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు.అనంతరం పరిపాలన అధికారి రాజ్ కుమార్ కు హామీలు అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం ఇచ్చి మాట్లాడారు.రుణమాఫీ,నిరుద్యోగ భృతి,మహిళలకు నెలకు ₹2,500 వంటి హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు.హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు.రైతులకు హామీ ఇచ్చిన విధంగా రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని,రైతన్నను నిలువునా మోసం చేస్తున్నారని ద్వజమెత్తారు.గ్యారెంటీలు అమలు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.వంగ రామచంద్రారెడ్డి,కొత్తపల్లి వేణు గోపాల్,బాసంగారి వెంకట్,కాసన గొట్టు సంతోష్,గాడిపల్లి భాస్కర్,,విభీషణ్ రెడ్డి,తొడుపునూరి వెంకటేశం,మనోహర్,ప్రసాద్,అశోక్,శ్రీనివాస్,సత్యనారాయణ,కెమ్మసారం సంతోష్,సునీల్,కార్తీక్ కనకరాజు,ఉమారెడ్డి,పద్మ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.