ముద్ర ప్రతినిధి, బండ్లగూడ :
తమ నియోజకవర్గంలో నివాసముంటున్న ప్రతి ఒక్కరికి ఎలాంటి ఆపద వచ్చిన సహాయం చేయడానికి ముందు ఉంటామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి దశాబ్దాల క్రితం వచ్చి హైదర్ షాకోట్ పీజీ కాలనీలో నివాసముంటున్న బెల్లంకొండ వసంత తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదని బండ్లగూడ జాగీర్ మాజీ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను కలిసి వారి పరిస్థితి వివరించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రెండున్నర లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని గురువారం అందజేశారు. మాజీ డిప్యూటీ మేయర్ పూలపల్లి రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా ఆమె కుటుంబ సభ్యులు మురళికి ఈ సహాయాన్ని అందించారు.