ముద్ర, కోరుట్ల;
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని భూషణ్ రావు పేట గ్రామానికి చెందిన ఏనుగు సంతోష్ రెడ్డి అనే యువకుడు దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో అగ్నివీర్ ద్వారా ఆర్మీలో చేరాడు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం రోజు మండల కేంద్రానికి వచ్చిన సంతోష్ రెడ్డి ని కథలాపూర్ ఎస్సై రవి కిరణ్ అభినందించి శాలువాతో సత్కరించారు. మండలంలోని యువత ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని అన్ని రంగాలలో రాణిస్తూ దేశానికి సేవ చేయాలని కథలాపూర్ ఎస్సై రవికిరణ్ కోరారు.