Take a fresh look at your lifestyle.

సైబరాబాద్ కార్పొరేషన్ తొలి కమిషనర్ గా శ్రీజన

 

ఐటీ కారిడార్, వెస్ట్ హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాల అభివృద్ధి, పరిపాలన బాధ్యతల స్వీకరణ

ముద్ర, తెలంగాణ బ్యూరో :

నూతనంగా ఏర్పడిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి కమిషనర్‌గా శ్రీజన బాధ్యతలు స్వీకరించారు.బుధవారం‌ నుంచి అమె ఐటీ కారిడార్, వెస్ట్ హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాల అభివృద్ధి, పరిపాలన బాధ్యతలు పర్యవేక్షించనున్నారు. ఐటీ హబ్ అయిన సైబరాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్, వ్యర్థాల నిర్వహణ, మౌలిక సదుపాయాల మెరుగుదల లాంటి ప్రధాన సవాళ్లు ఆమె ముందు ఉన్నాయి. ఇదీలా వుంటే…
హైదరాబాద్ మహా నగర పాలనను మరింత మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని విభజిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు స్వతంత్ర మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఈ మేరకు శ్రీజన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆమె వెంట మూడు కార్పొరేషన్లకు ప్రత్యేకాధికారిగా నియమించబడిన సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ కూడా ఉన్నారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి శ్రీజన తన సమర్థతతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమె గతంలో విశాఖపట్నం కమిషనర్‌గా, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్‌గా పనిచేశారు. కోవిడ్ సమయంలో బాలింతగా ఉండి కూడా కేవలం 22 రోజులకే విధుల్లోకి చేరి తన కర్తవ్యాన్ని నిర్వహించి అందరి మెప్పు పొందారు.

Leave A Reply

Your email address will not be published.