Take a fresh look at your lifestyle.

ఓటు హక్కు వినియోగించుకున్న స్థానిక సంస్థ ల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌లో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, కుటుంబ సభ్యులతో కలసి 3 వ వార్డు రాయగిరి లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి చేరుకుని నిర్భయంగా ఓటు వేయాలని, స్థానిక స్వపరిపాలనలో భాగస్వాములు కావాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.