Take a fresh look at your lifestyle.

సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  సారంగాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్   కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓ పీ  సేవలు, ఐపీ సేవలు, రికార్డ్స్, ల్యాబ్ రికార్డ్స్, ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసిని కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలు మెరుగు పరచాలని డాక్టర్లు సమయ పాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారు అని ఆరా తీశారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముందస్తు వర్షాకాలం డెంగ్యూ వైరల్ ఫీవర్లకు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు  ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్ ఉండకుండా చూసుకోవాలని సూచించారు.డాక్టర్లను వివరాలను అడిగి తెలుసుకుని అనంతరం ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలోని వున్న పిచ్చి మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధు సుధన్,మాత సంరక్షణ అధికారి ముస్కు మహిపాల్ రెడ్డి, ఆస్పత్రి సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.