నగరంలోని గోషామహల్ పోలీస్ గ్రౌండ్లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. వరల్డ్ క్లాస్ వసతులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. 26.30 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఆసుపత్రి నిర్మాణం ప్రభుత్వం చేపడుతోంది. భూమి పూజ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎస్ శాంత కుమారి సహా ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గోషామహల్ స్టేడియంలో ఆధునిక హంగులతో ఆసుపత్రి నిర్మాణం జరగబోతుంది. స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేక భవనాలు నిర్మించనున్నారు. అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ఇక్కడ అందుబాటులో ఉండనున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలు అందనున్నాయి. పేషంట్ల అటెండెండ్ల కోసం ఆసుపత్రి ఆవరణలోనే ధర్మశాల ఏర్పాటు చేయనున్నారు.