Take a fresh look at your lifestyle.

ఏడాదిగా రియల్ ఎస్టేట్లో గిరాకీ లేక.. బిల్డర్ ఆత్మహత్య

  • ఎనిమిదేండ్లుగా నిర్మాణ రంగంలో రాణిస్తున్న వేణుగోపాల్ రెడ్డి
  • ఏడాదిగా రియల్ ఎస్టేట్ పడిపోయి.. బ్యాంకు రుణాలు, అప్పులు-ఒత్తిడి పెరగడంతో బలవన్మరణం
  • మేడ్చల్ జిల్లా పరిధిలోని కొంపల్లిలో నివాసముంటున్న ముత్యాల వేణుగోపాల్ రెడ్డి (39) అనే బిల్డర్ ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని ఆత్మహత్య
  • రెండేండ్ల క్రితం గుండ్లపోచంపల్లిలో 480 చదరపు గజాల విస్తీర్ణంలో ఐదంతస్తుల అపార్ట్‌మెంట్ నిర్మాణం వేణుగోపాల్ రెడ్డి మొదలుపెట్టారు.. ఇందుకు పలు బ్యాంకుల నుంచి, ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేశారు
  • అపార్ట్‌మెంట్లో పది ఫ్లాట్లు అమ్మితే అప్పులన్నీ తీరడంతో పాటు ఆర్థికంగా లాభపడతానని ఆశించారు.. కానీ ఏడాది నుంచి ప్రయత్నిస్తున్నా మూడు ఫ్లాట్లు మాత్రమే బుక్ అయ్యాయి
  • దీంతో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి మరింత పెరిగి తన అపార్ట్‌మెంట్ నిర్మాణం వద్ద ఏర్పాటు చేసుకున్న కార్యాలయంలోనే వేణుగోపాల్ రెడ్డి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు

Leave A Reply

Your email address will not be published.