నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలకే పెద్దపీట.. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి 2026–27 బడ్జెట్‌లో భారీ కేటాయింపులు
నాణ్యమైన విద్యా.. మౌలిక సాదుపాయాల కల్పన..
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి బడ్జెట్లోపెద్ద పీటా
ఎస్సీ, ఎస్టీ వర్గాలను విద్య ద్వార ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడం ముఖ్యమంత్రి గారి లక్ష్యం
బడ్జెట్ లో విదేశీ విద్యా అవకాశాలు పెంపుకు చర్యలు..
ఉన్నత ప్రమాణాలతో సడ్డీ సర్కిళ్లు..
2026–27 బడ్జెట్పై అధికారులతో మంత్రి అడ్లూరి సమీక్ష..

ధర్మపురి:
షెడ్యూల్డ్ కులాల మరియు గిరిజన వసతి గృహాలలో హాస్టల్ విద్యార్థుల నాణ్యమైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయల కల్పనలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, గిరిజన సంక్షేమం, దివ్యాంగులు వయోవృద్ధులు మరియు ట్రాన్స్ జెండర్ ల సాధికారత శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ గారు స్పష్టం చేశారు.
గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మరియు గిరిజన సంక్షేమ తదితర శాఖల ఉన్నతాధికారులతో బడ్జెట్ ప్రతిపాదనలపై ముందస్తు బడ్జెట్ చర్చలపై వివరణాత్మక అంశాలపై మంత్రి అడ్లూరి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈసందర్భంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలు, గిరిజన ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న వసతి గృహాలలలో వసతులు, మరమ్మతులు, రవాణా సౌకర్యం తదితర సదుపాయాలకు సంబంధించిన ప్రతిపాదనలను రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యాను ప్రాధాన్యం ఇస్తున్నారని నిధులకు ఏలాంటి కోరత లేదని మంత్రి స్పష్టం చేశారు. బడ్జెట్లో అవసరమైన నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి అన్నారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాల కు చెందిన విద్యార్థుల ను అత్యున్నత స్థాయికి తీసుకురావాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పమని, వారి ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. విద్యార్థుల నాణ్యమైన విద్యా ను అందించి ఉత్తమ ఫలితాలు సాధించి వారిని ఉన్నత శిఖరాలకు చేర్చే గురుతరమైన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని మంత్రి పేర్కొన్నారు. అందుకు అవసరమైన సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు హాస్టళ్లను పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టల్ విద్యార్థుల విద్యా, వైద్యం, సదుపాయల కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం అధిక నిధులను కేటాయించిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వివరించారు. హాస్టల్ విద్యార్థుల సంక్షేమం కోసం గత బడ్జెట్ లో హాస్టల్ విద్యార్థుల సంక్షేమం కోసం గత బడ్జెట్ లో పథకాల అమలుకు ప్రభుత్వం కేటాయించిన నిధుల అమలు తీరుపై ఒక నివేదికను రూపొందించి సమర్పించాలని మంత్రి ఉన్నతాధికారులను ఆదేశించారు. హాస్టల్, భవనాలు, వసతులు, మరమ్మతులు సదుపాయాలపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని నివేదికలను అందజేయాలని, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా చూసుకోవాలని మంత్రి అన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్రీ – మెట్రిక్ ఉపకార వేతనాలను పెంచామని, విద్యాబోధనలో అసమానతలను తొలగించేందుకు ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని మంత్రి ఈసందర్భంగా గుర్తు చేశారు. సంక్షేమ పథకాలను మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు తీసుకోవలసిన చర్యలను అధికారులు ఒక నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రి ఆదేశించారు.
విదేశి విద్యా సహకారం కోసం..
విదేశీ విద్యను సాకారం చేసుకోవాలనే ఎస్సీ విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ఓ వరం లాంటిదని, లబ్ధిదారుల సంఖ్యను గతంలో ఉన్న 200 సీట్లను 500 కు పెంచామని, అధిక నిధులను కేటాయించామని, పోస్టు మెట్రిక్ విద్యార్థుల కోసం నిధులను మంజూరు చేశామని, బిఏఎస్ విద్యా పథకాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నామని నిధులు కేటాయించామని మంత్రి తెలిపారు. దేశంలోనే అత్యున్నత స్థాయిలో విద్యా విధానాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉన్నదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ హాస్టల్ విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని మంత్రి అన్నారు.
ఉన్నత ప్రమాణాలతో స్టడీ సర్కిళ్ళు
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని మంత్రి తెలిపారు. జాతీయ ప్రమాణాలతో పోటీపడేలా స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రణాళికలను రూపొందిస్తున్నారని మంత్రి వివరించారు. లోయర్ ట్యాంక్ బండ్, కాచిగూడ అంబేద్కర్ భవనాలను ఢిల్లీ, చెన్నై తరహాలో అత్యాధునికంగా రూపొందిస్తున్నామని మంత్రి వివరించారు.