బోడుప్పల్, ముద్ర:
మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్లలో బోడుప్పల్ సర్కిల్ ముందంజలో ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులకు చివరి రోజు మార్చి 31వ తేదీ.. సరిగా ఈ ఒక్కరోజే సాయంత్రం 7.30 గంటల సమయందాకా 86 లక్షల రూపాయలు ఆస్తిపన్ను వసూలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇప్పటిదాకా డిమాండ్ మేరకు 45 కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు డిప్యూటీ కమిషనర్ శైలజ తెలిపారు. ఇలా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14 సర్కిళ్లలో బోడుప్పల్ సర్కిల్ డిమాండ్ మొత్తంపై అత్యధిక వసూళ్లు సాధించి ముందంజలో నిలిచింది. అలాగే, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చెక్కులు “కమిషనర్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్” పేరిట చెల్లించవలసిందిగా ప్రజలకు, గృహ, వాణిజ్య యజమాను దారులకు మున్సిపల్ అధికారి శ్యామ్ సుందర్ తెలిపారు.