ముద్ర నడిగూడెం….
మైసూర్ దత్తపీఠ ఆధ్వర్యంలో ఆన్లైన్ ద్వారా నిర్వహించిన భగవద్గీత కంఠస్థ పోటీలో మండల కేంద్రానికి చెందిన వందనపు శృతి, కోదాడకు చెందిన బొడ్ల మాధవి బంగారపు పథకాలకు ఎంపికైనట్లు శుక్రవారం తెలిపారు. 700 శ్లోకాలు ఆన్లైన్ శిక్షణ ద్వారా కంఠస్థ పోటీల్లో ప్రతిభ కనబరిచారు.

ఇరువురు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మే 10 వ తారీఖున మైసూర్ లో శ్రీ సచ్చిదానంద స్వామీజీ నుంచి బంగారు పథకాలు అందుకోనన్నారు. భగవద్గీత పఠనం లో బహుమతులు పొందిన ఇరువురిని బంధువులతోపాటు గ్రామస్తులు అభినందించారు.