ముద్ర ప్రతినిధి, మెదక్:
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రజావాణిలో వస్తున్న ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని, తిరస్కరించిన పక్షంలో అందుకు గల కారణాలను అర్జీదారుడికి తెలియజేస్తూ లిఖితపూర్వక వివరణ అందజేయాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డీఓ శ్రీనివాస్ రావులతో కలిసి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.
99 రోజుల కార్యక్రమలను పక్కగా అమలు చేయాలి
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమలను జిల్లా అధికారులు పక్కగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులతో సమీక్షించారు. అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించి, క్షేత్రస్థాయి నివేదికలను త్వరితగతిన అందించాలని అధికారులను ఆదేశించారు.
అర్హులైన ప్రతి వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని సూచించారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.