Take a fresh look at your lifestyle.

సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన సర్పంచ్ శిగ నరేష్ గౌడ్

ముద్ర, బీబీనగర్ :

మండలం ముగ్ధంపల్లి గ్రామంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశానుసారం ఎస్సీ కాలనీ మెయిన్ రోడ్డు నుండి పోచమ్మ గుడి వరకు గ్రామ సర్పంచ్ శిగ నరేష్ గౌడ్ సిసి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శిగ నరేష్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే హెచ్ఎండి నిధుల మంజూరు చేయడంతో గ్రామంలో సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు అంచలవారిగా ఒక్కొక్కటి చేసుకోవడం జరుగుతుంది, ప్రతి వీధిలో సిసి రోడ్లు నిర్మాణం తో పాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ శెట్టి సోనీ మల్లేష్, ఎంజాల వెంకటేష్, మట్ట గోపి, శేఖర్ రెడ్డి, ప్రసన్న, గోరుగంటి శంకర్, బాలకృష్ణ, పాదం రాధిక, సురేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.