Take a fresh look at your lifestyle.

వరుస సమీక్షలతో కలెక్టర్ బిజీ..

  • రామగుండం కార్పొరేషన్ పని తీరు, అంగన్వాడీలపై సమీక్షించిన కలెక్టర్ శ్రీహర్ష

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: రామగుండం కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారురామగుండం పురపాలక కార్యాలయంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష గురువారంస్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీతో కలిసి వరుస సమీక్షలు నిర్వహించి, అధికారుల పని తీరుపై సూచనలు, సలహాలు అందించారు.
కార్పొరేషన్ పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్షిస్తు తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టి.యూ.ఎఫ్.ఐ.డి.సి) నిధుల ద్వారా చేపట్టిన నగరాభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ, ఆస్తి పన్ను వసూలు, టౌన్ ప్లానింగ్, తదితర అంశాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, వరద నియంత్రణ పనులకు ప్రాధాన్యత కల్పిస్తూ త్వరితగతిన పూర్తయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. పూర్తయిన పనులకు బిల్లుల చెల్లింపులు చేయాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు ఆస్తి పన్నులు వసూలు చేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణ కోసం నూతనంగా కొనుగోలు చేసిన ఆటోలు, ట్రాక్టర్ లు పూర్తిస్థాయిలో వినియోగించాలని, నగరంలో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, చెత్త సేకరణ సంబంధించి నిర్దేశిత షెడ్యూల్ ఫాలో కావాలని , రోడ్లపై ఎక్కడ చెత్త లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఈఈ రామణ్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

అంగన్వాడి కేంద్రాల పనితీరుపై..

అనంతరం రామగుండం పరిధిలోని అంగన్వాడి కేంద్రాల పనితీరుపై సమీక్షించారు. మహిళలు, పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పకడ్బందీ సేవలు అందించాలని కలెక్టర్ అన్నారు. ప్రతి సూపర్వైజర్ తన పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలను రెగ్యులర్ గా మానిటర్ చేస్తూ అవసరమైన పౌష్టికాహారం సెంటర్ కు అందుతుందా, గర్భినులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ సక్రమంగా జరుగుతుందా వివరాలు తెలుసుకోవాలని, అంగన్వాడి కేంద్రాలకు పౌష్టికాహార సరుకులను రెగ్యులర్ గా పంపిణీ చేయాలని కలెక్టర్ తెలిపారు. న్యూట్రిషన్ కు సంబంధించి వాస్తవిక పరిస్థితులు నమోదు చేయాలని, ఎంత ఎక్కువ మంది గుర్తిస్తే అంత మంచిదని , పోషక లోపంతో బాధపడే పిల్లలకు బాల అమృత్ ప్లేస్ లో అందజేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతినెల పిల్లల బరువు చెక్ చేయాలని, తక్కువ బరువు ఉన్న పిల్లలకు అవసరమైన పోషకాలు అందించాలని సూచించారు.మానసిక వైకల్యం గల పిల్లలను ముందుగానే గుర్తించి వారిని మనో చైతన్య పాఠశాలలో జాయిన్ చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని తెలిపారు. గ్రామాలలో క్రోనిక్ వ్యాధులు గుర్తించిన 14 మందికి జిల్లా వైద్యా శాఖ ద్వారా అవసరమైన పరీక్షలు నిర్వహించి చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, సిడిపిఓ అలేఖ్య, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.