Take a fresh look at your lifestyle.

జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులను ఇవ్వాలి ఆలేరు ప్రెస్ క్లబ్ డిమాండ్

ముద్ర, ఆలేరు :

జర్నలిస్టులoదరికీ ప్రభుత్వం అక్రిడేషన్ కార్డులను అందించాలని ఆలేరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహ మ్మద్ కుర్షిద్ పాషా డిమాండ్ చేశారు. ఆదివారం ఆలే రులో జరిగిన ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిన్న, పెద్ద పత్రికలు అని చూడకుండా, జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్ కార్డులను ప్రభుత్వం అందించేలా దృష్టి సారించాలని కోరారు. హెల్త్ కార్డులను అందింపజేసి,మెరుగైన వైద్య సేవలను కల్పించాలన్నారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా ప్రతిష్టమైన చర్యలను తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కోరుటూరు ఉపేందర్, సీనియర్ జర్నలిస్టులు ఎర్ర జాన్సన్, తోట మల్లయ్య, గుండు మహేందర్, ఎ లగల కుమారస్వామి, దూడల సాగర్ వంగరి శివకుమార్,సిరిగిరి స్వామి సీస సాయిరాం, సందేన శంకర్ గుండు మధు,మంచన మల్లేశం బోడ నరేష్, కూళ్ళ సిద్ధులు, శ్రీనివాస్ ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.