ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న “హెల్త్ వీక్” కార్యక్రమాలను సమన్వయంతో విజయవంతం చేసి,ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో ఆరోగ్య సేవల బలోపేతం,ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంపు లక్ష్యంగా ఈనెల 6 నుండి 11 వరకు నిర్వహిస్తున్న “హెల్త్ వీక్” కార్యక్రమాలపై సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.
హెల్త్ వీక్‌లో భాగంగా ఏప్రిల్ 6న ఆహార భద్రత దినం,7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం,8న సురక్షిత తల్లి దినం,9న ఎయిడ్స్ అవగాహన & నివారణ దినం ,10 న హోమియోపతి, ఆయుష్ దినం ఏప్రిల్ 11 న ఔషధ నియంత్రణ బలోపేత దినం కార్యక్రమాల సందర్భంగా సంబంధిత అంశాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రతిరోజు నిర్వహించిన కార్యక్రమాలపై ఫోటోలు, వివరాలతో కూడిన నివేదికను సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి సూచించారు.
ఈసమావేశంలో అడిషనల్ కలెక్టర్ పాండు,డిఎంఅండ్ హెచ్ ఓ వసంత్ రావు, డిప్యూటీ డిఎంఅండ్ హెచ్ ఓ, జిజిహెచ్ సూపరింటెండెంట్ మురళీకృష్ణ,డీసీహెచ్‌ఎస్ కవిత,ప్రోగ్రాం అధికారులు, డాక్టర్ నాగనిర్మల,డాక్టర్ శశాంక్,డీడబ్ల్యుఓ లలిత కుమారి,డ్రగ్స్ కంట్రోల్,ఫుడ్ సేఫ్టీ,జైలు శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.