Take a fresh look at your lifestyle.

​గాయత్రీ నగర్‌లో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ​ముఖ్య అతిథిగా హాజరైన ముమ్మారెడ్డి ప్రేమ కుమార్

 

ముద్ర కూకట్‌పల్లి,:
కూకట్‌పల్లి నియోజకవర్గంలోని గాయత్రీ నగర్ డివిజన్‌లో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సైబరాబాద్ కార్పొరేషన్ కో-ఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై, సభ్యత్వ నమోదును లాంఛనంగా ప్రారంభించారు.
​ఈ సందర్భంగా ప్రేమ కుమార్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి
​జనసైనికులు, వీర మహిళలు బాధ్యతగా డివిజన్‌లోని ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలి.
​కొత్త సభ్యులను ఆహ్వానిస్తూ, జనసేన ఆశయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి పార్టీని మరింత శక్తివంతం చేయాలి అని
ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
​ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, గాయత్రీ నగర్ డివిజన్ జనసైనికులు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.