Take a fresh look at your lifestyle.

పేదింటి ఆడబిడ్డల వివాహ కానుక అందజేసిన బీర్ల ఫౌండేషన్ చైర్ పర్సన్ బీర్ల అనిత

ముద్ర, భువనగిరి ప్రతినిధి :
యాదగిరిగుట్ట పట్టణంలోని బీర్ల నిలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సతీమణి బీర్ల ఫౌండేషన్ చైర్‌పర్సన్ బీర్ల అనిత బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో పలువురు ఆడబిడ్డల పెళ్లిళ్లకు వివాహ కానుకలను అందజేశారు. ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన గర్దాసు రమ్య – క్రాంతికుమార్ దంపతుల కూతురు వివాహానికి వివాహ కానుకను అందజేశారు.
యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామానికి చెందిన ఆలకుంట్ల లక్ష్మి – యాదగిరి దంపతుల కూతురు వివాహానికి వివాహ కానుకను అందజేశారు.
మోటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామానికి చెందిన వంగా లలిత – రమేష్ దంపతుల కూతురు వివాహానికి వివాహ కానుకను అందజేశారు. ఈ సందర్భంగా బీర్ల అనిత మాట్లాడుతూ, బీర్ల ఫౌండేషన్ ద్వారా అవసరమైన కుటుంబాలకు ఎల్లప్పుడూ సహాయం అందిస్తామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.