ముద్ర ప్రతినిధి, నిర్మల్:
నేటి పరిస్థితుల్లో ఆర్థిక అక్షరాస్యత అవసరమని లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ అన్నారు. జిల్లాలోని సారంగాపూర్ మండలం చించోలి–బి మహిళా ప్రాంగణంలో ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి ఉపాధి సృష్టి పథకం పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, ప్రాంగణం అధికారి విజయలక్ష్మి లు పథకాలు, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. యువత ప్రభుత్వ పథకాలను వినియోగించుకుని స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. వ్యాపార అభివృద్ధి, వ్యాపార ప్రణాళిక, యాజమాన్య నైపుణ్యాలపై మార్గనిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఇడిసి మేనేజర్ అభినయ్ దీప్, అసిస్టెంట్ మేనేజర్ తేజస్వి తదితరులు పాల్గొన్నారు.