Take a fresh look at your lifestyle.

గ్యాస్ కొరత లేదు -జిల్లా కలెక్టర్ దీపక్ తివారి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఒక ప్రకటన లో తెలిపారు. గృహావసరాలకు, విద్యాలయాలు, ఆసుపత్రులకు ఎల్. పీ.జీ సరఫరాలో ఎలాంటి లోటు లేదని, ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందవద్దని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో గృహ అవసరాలకు, విద్యాలయాలు, ఆసుపత్రులకు అవసరమైన ఎల్.పీ.జీ. సిలిండర్ల సమస్య లేదని, అవసరమైన మేర సరఫరా చేసేందుకు పగడ్బందీగా చర్యలు తీసుకోవడం జరుగిందని, జిల్లామరియు మండలం వారీగా బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు కొరత లేదని, గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్ లను ఎవ్వరైనా అక్రమంగా నిల్వ చేసిన, బ్లాక్ మార్కెటింగ్ చేసిన అట్టి వ్యక్తులపై న చట్ట రీత్యా చర్యలు తీసుకోబడునని , బి ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ 7 ( నిత్యావసర వస్తువుల పరిరక్షణ )చట్టం ప్రకారం కఠినచర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.