Take a fresh look at your lifestyle.

ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలి

  • ఎమ్మెల్యే సంజయ్ కుమార్.

ముద్ర,రాయికల్: జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని 1,5,6,7, 8 వార్డులలోఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాలినడకన మంగళవారం పలు వార్డులలో పర్యటించి వార్డు సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.రాయికల్ పట్టణంలో ఆయా వార్డులలో 6 కోట్ల తో జరిగిన పనులను పరిశీలించి,వార్డులలో అవసరమైన డ్రైనేజీ పనులు సీసీ రోడ్లు,విద్యుత్ స్తంభాలు, వంతెన నిర్మాణం, పొలాల నుండి వెళ్లే ప్రధాన నాలా లను పరిశీలించి పనులు పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల రాయికల్ పట్టణానికి 15 కోట్ల నిధులు మంజూరు చేయగా అట్టి నిధుల నుండి ప్రణాళిక ప్రకారం ప్రజలకు అవసరమైన అతి ప్రాధాన్యమైన పనులను పూర్తి చేయాలని,అంచనాలు రూపొందించాలని,సంబంధిత అధికారులకు సూచనలు చేశారు.రాయికల్ మున్సిపల్ లో శానిటేషన్ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ కొన్ని పనుల్లో నాణ్యత లోపాల పట్ల ఇంజనీరింగ్ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.రాయికల్ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే సోమవారం రాత్రి రాయికల్ పట్టణంలోనే బస చేసి ఉదయం పట్టణంలో పర్యటించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఎంపీడీవో చిరంజీవి, ఎమ్మార్వో నాగార్జున,ఎంపీ ఓ సుష్మ, మాజీ మున్సిపల్ ఛైర్మన్ మోర హనుమండ్లు,వైస్ ఛైర్మన్ గండ్ర రమాదేవి అచ్యుత రావు, ఫా క్స్ ఛైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, రవీంధర్ రెడ్డి, కోల శ్రీనివాస్, పట్టణ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, ఏఈలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.