Take a fresh look at your lifestyle.

పోరాట స్పూర్తితో “సమ్మె” లో కలిసిరండి

  • కార్మికులకు “ఐక్యవేదిక” పిలుపు.

యైటింక్లయిన్ కాలనీ. ముద్ర: సింగరేణి కార్మికసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం రామగుండం వకీల్ పల్లె గనిపై ద్వారా సమావేశం జరిగింది. ఉదయం జరిగిన సమావేశంలో ఐక్యవేదిక నాయకులు ఈ. నరేష్ మాట్లాడుతూ.. కార్మికవర్గాన్ని కార్పొరేట్ సంస్థలకు కట్టుబానిసలు చేసే లేబర్ కోడ్ లు మాకొద్దని, ప్రస్తుత కార్మిక చట్టాల జోలికి వస్తె, ఐక్య పోరాటాలతో కార్పొరేట్ విధానాలను పాతాళానికి తొక్కిపెడతామని హెచ్చరించారు. కార్మికవర్గం ఐక్యంగా ఈ నెల 9న చేస్తున్న సమ్మెలో భాగస్వాములు కావాలంటూ ఆయన సింగరేణి కార్మికులకు పిలుపునిచ్చారు. అనేకమంది అమరుల త్యాగాల ఫలితంగా లభించిన కార్మికచట్టాల ను కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా మార్చే వైఖరిని కేంద్ర ప్రభుత్వం మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. గత పోరాటాల వారసత్వం స్పూర్తితో నాలుగు నల్ల చట్టాలు (లేబర్ కోడ్) లకు వ్యతిరేకంగా పోరాడి, కార్మిక హక్కులను రక్షించుకోవడం కోరకు ఈ నెల 9న జరిగే సార్వత్రిక సమ్మెలో పాల్గొని, మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన కార్మికులకు పిలుపునిచ్చారు. ఇంకా సమావేశంలో ఐక్యవేదిక నాయకులు బి. అశోక్, జి. రాములు, దావు రమేష్, పోగుల శేఖర్, శ్రీనివాస్, మాతంగి రాయమల్లు, చింతల శేఖర్, ఎస్ ప్రసాద్, పోచయ్య, హయూబ్ ఖాన్, ఎం రామస్వామి, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.