Take a fresh look at your lifestyle.

తెలుగు రాష్ట్రాల బ్రాహ్మ‌ణ వివాహ ప‌రిచ‌య వేదిక

  • శ్రీన‌గ‌ర్ కాల‌నీలోని శ్రీ స‌త్య‌సాయి నిగ‌మాగంలో.
  • ఈ నెల 27న.. ఆదివారం జ‌రుగును.

తెలుగు రాష్ట్రాల‌కు చెందిన బ్రాహ్మణ వివాహ ప‌రిచయ వేదికను ఈ నెల‌ 27న.. శ్రీన‌గ‌ర్ కాల‌నీలోని శ్రీ స‌త్య‌సాయి నిగ‌మాగ‌మంలో నిర్వ‌హిస్తున్నామ‌ని.. బ్రాహ్మ‌ణ సేవా సంఘ స‌మాఖ్య తెలియ‌జేసింది. సోమ‌వారం పంజాగుట్ట స‌ర్కిల్‌లోని కేంద్ర కార్యాయంలో జ‌రిగిన స‌మావేశంలో.. సంఘం ఛైర్మ‌న్ సి.సుధాక‌ర్‌, అధ్య‌క్షుడు సీ ప్ర‌భాక‌ర్ రావులు మాట్లాడుతూ.. గ‌త పంతొమ్మిది సంవ‌త్స‌రాల నుంచి తాము ప్ర‌తిఏటా బ్రాహ్మ‌ణ వివాహ ప‌రిచ‌య వేదిక‌ను విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. దీన్ని ద్వారా అనేక జంట‌ల‌కు మంచి పెళ్లి సంబంధాలు కుదురుతున్నాయ‌ని సంతోషం వ్య‌క్తం చేశారు.ఇప్ప‌టివ‌ర‌కూ సుమారు నాలుగైదు వేల జంట‌లు వివాహాల్ని చేసుకుని.. సంతోషంగా జీవ‌నాన్ని కొన‌సాగిస్తున్నార‌ని తెలిపారు. ఇదే స్ఫూర్తితో జులై 27న తెలుగు రాష్ట్రాల‌కు చెందిన బ్రాహ్మ‌ణ వివాహ ప‌రిచ‌య వేదిక‌ను ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి ఏర్పాట్లు చేశామ‌న్నారు. ఈ స‌మావేశంలో సంఘ కార్య‌ద‌ర్శి కె.చంద్ర‌శేఖ‌ర్‌, ఇత‌ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.