Take a fresh look at your lifestyle.

సజావుగా జరుగుతున్న ధాన్యం కొనుగోలు

  • నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా మద్దతు ధరకు కొనుగోలు.
  • జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని,  కొనుగోలు కేంద్రాలకు వచ్చే నాణ్యమైన ధాన్యాన్ని వేగవంతంగా మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు.శుక్రవారం జగిత్యాల రూరల్ మండలంలోని పొలాస, బాలపెళ్లి పి.ఎ సి ఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు వివరాలు, అందుబాటులో ఉన్న తార్పలిన్ కవర్లు, గన్ని బ్యాగులు, కొనుగోలు చేసిన ధాన్యం మిల్లులకు తరలింపు తదితర వివరాలను జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జగిత్యాల రూరల్ మండలంలో బాల పల్లి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరుగుతుందని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నామని, ప్రతిరోజు మిల్లులకు పంపుతున్నామని, రవాణా నిమిత్తం లారీల కొరత ఎక్కడా లేదని జిల్లా కలెక్టర్ తెలిపారు.రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఎప్పటికప్పుడు ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని అన్నారు.కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం 17 తేమ శాతం రాగానే కాంటా వేసి  కొనుగోలు చేసి సంబంధిత మిల్లులకు తరలించాలని అన్నారు.ధాన్యం రవాణా అంశంలో వాహనాల కొరత, హామా లీల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట  జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి మధుసూదన్, జగిత్యాల రూరల్ మండల్ తహసిల్దార్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.