ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి
ముద్ర, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో పది మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధప్రకాశ్ నియమితులయ్యారు. ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్ బాధ్యతలు చేపట్టనున్నారు. గిరిజన సంక్షేమ ప్రత్యేక సీఎస్‌గా కూడా ఆయన కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే పంచాయతీరాజ్ కమిషనర్‌గా దివ్య దేవరాజన్ కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌కుమార్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు నిర్వహించనున్నారు. ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా కాత్యాయనీ దేవి బదిలీ అయ్యారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ జేఎండీగా కాత్యాయనీ దేవికి అదనపు బాధ్యతలు అప్పగించారు. జలమండలి జేఎండీగా మయాంక్ మిట్టల్ నియమితులయ్యారు. పరిశ్రమలశాఖ ప్రత్యేక కార్యదర్శిగా రఘురామ్‌శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు. మంత్రి శ్రీధర్‌బాబు ఓఎస్‌డీగా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు.