- కల్వరాల గ్రామ పరిధిలో భీమా కెనాల్ ను పరిశీలించిన మంత్రి జూపల్లి
ముద్ర,వీపనగండ్ల: వేసవి లో గ్రామాల ప్రజలకు త్రాగునీటి కోసం ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.మండల పరిధిలోని కల్వరాల సమీపంలో బీమా కాల్వను పరిశీలించిన మంత్రి జూపల్లి
కే ఎల్ ఐ కాలువను భీమా కు అనుసంధానం చేసి కే ఎల్ ఐ నుంచి నీళ్లను గోపాల్ దీన్నే రిజర్వాయర్ కు తరలించాలి అని అధికారులను ఆదేశించారు.శ్రీరంగాపూర్ రిజర్వాయర్ నుంచి భీమా ద్వారా నీళ్లను మంత్రి జూపల్లి గారు విడుదల చేయించారు.కే ఎల్ ఐ భీమా కెనాల్ నుంచి గోపాల్ దీన్నే రిజర్వాయర్ కు తరలించి వేసవి లో త్రాగునీటి సమస్యలు రాకుండా గ్రామాల ప్రజలకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులకు వివరించారు.వేసవిలో త్రాగునీటి సమస్య రాకూడదు అని,ముందు జాగ్రత్తతో కాలువల వెంట తిరుగుతూ ఆయా గ్రామాల రైతులను కలిసి సాగునీటి సమస్య లేకుండా పంటలను కాపాడుతామని తెలిపారు.కార్యక్రమంలో కే ఎల్ ఐ, బీమా అధికారులతో పాటు నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటకశాఖ అధికారి కల్వరాల నరసింహ, నాయకులు వెంకటస్వామి, పూరి శేఖర్, రమేష్ గౌడ్ తదితరులు ఉన్నారు.
